కలెక్టర్‌ను సన్మానించిన ఆప్ నాయకులు
NRML: ప్రతిష్టాత్మక జల సంచయ్ జన భాగీదారీ అవార్డు అందుకున్న నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కలెక్టరేట్‌లో ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ శాలువా కప్పి పూల బుకే అందజేశారు. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ నాయకత్వాన్ని ఆప్ నాయకులు ప్రశంసించారు.