హిర మండలంలో వర్షం.. రైతులు సంతోషం

SKLM: హిర మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం స్థానికులకు ఉపశమనం కలిగించింది. ఉదయం నుంచి ఎండవేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు వర్షం వచ్చి ఊపిరి పీల్చుకున్నారు. పోడు భూములలో పండించే కొర్రలు, జొన్నలు, కందులు, పసుపు, సజ్జలు, ఆకాకరకాయలు, చిలగడదుంపలు తదితర పంటలకు ఈ వర్షం మేలు చేస్తుందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేశారు.