నాసిరకంగా సీసీ రోడ్డు పనులు

WNP: చిట్యాలరోడ్డులోని డబల్ బెడ్ రూమ్ కాలనీలో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు పనులలో కాంట్రాక్టర్ నాణ్యత పాటించడం లేదని కాలనీవాసి బలరాం వెంకటేష్ ఆరోపించారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం రూ.లక్షల నిధులు కేటాయిస్తుంటే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పనులలో నాణ్యత పాటించడం లేదని వెంకటేష్ ఆరోపించారు.