రేపు పిడుగులతో కూడిన వర్షాలు.!
PPM: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో సోమవారం జిల్లాలో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.