కొండాపూర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్
NZB: కొండాపూర్ గ్రామంలో 20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామ అభివృద్ధికి నిధులు అందించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుచ్చన్న, శ్రీధర్, జగన్, రవి గౌడ్, చంద్రగౌడ్, ఇసాక్, ఫరూక్ పాల్గొన్నారు.