'ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి'

'ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి'

ADB: ఆశా కార్యకర్తల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని మాజీమంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆశా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం ఆశాలకు ఒకటవ తేదీ రోజున వేతనం అందజేయడం జరిగిందన్నారు. కనీస వేతన చెల్లింపు, తదితర సమస్యలు పరిష్కరించేంత వరకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.