రేపు మీ కోసం కార్యక్రమం రద్దు

SKLM: కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణంలో ప్రతీ శుక్రవారం నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమం వాయిదా వేసినట్లు ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసు పీఈటీ పరీక్షలు నేపథ్యంలో మీకోసం నిర్వహించడం లేదన్నారు. కావున కాశీబుగ్గ పరిసర ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.