ఏయూ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కి ఆహ్వానం

ఏయూ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కి ఆహ్వానం

VSP: ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్ రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్లో ఫైన్ ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌కి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు వీసీ జీపీ రాజశేఖర్ తెలిపారు. ఈనెల 27 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని ప్రజలు తిలకించాలని కోరారు.