'అర్జీలను సత్వరమే పరిష్కరించాలి'

'అర్జీలను సత్వరమే పరిష్కరించాలి'

ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆర్జీదారుల నుంచి జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ దరఖాస్తులను స్వీకరించారు. సంబంధిత దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.