ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసిన లేపాక్షి ఆలయ ఛైర్మన్

ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసిన లేపాక్షి ఆలయ ఛైర్మన్

సత్యసాయి: లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజల నిర్వహణపై చర్చించేందుకు ఆలయ కమిటీ ఛైర్మన్ కరణం రమా నందన్.. ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ సౌకర్యాలు, భక్తుల అవసరాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు వివరించగా.. ఆలయ పురోగతికి అవసరమైన చర్యలకు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.