రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ

KNR: గంగాధర మండలంలోని కురిక్యాల క్లస్టర్లో రైతు బీమా దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో భాగంగా AEO వెంకట్‌స్వామి మాట్లాడుతూ.. జూన్ 5, 2025లోపు కొత్తగా పట్టా పాసు పుస్తకాలు వచ్చి 18- 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్న రైతులందరూ బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని లేదంటే బీమా పథకం వర్తించదన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 13 వరకు అవకాశం ఉందన్నారు.