VIDEO: దొంగల బీభత్సం.. మహిళ మెడలో గొలుసు చోరీ

VIDEO: దొంగల బీభత్సం.. మహిళ మెడలో గొలుసు చోరీ

PLD: నరసరావుపేట ప్రకాశ్‌నగర్‌లో గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. స్థానికులు బత్తుల జయంతి శుక్రవారం రాత్రి సాయిబాబా గుడికి వెళ్లి వస్తుండగా, ఆమె మెడలోని 35 గ్రాముల బంగారు నానుతాడును లాక్కెళ్లారు. ఈ దాడిలో కిందపడి స్పృహ తప్పిన బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.