ఘనంగా శ్రీ వీరపెద్దన్న స్వామి ఉత్సవాలు

ATP: పుట్లూరు మండలంలోని ఎల్లుట్లలో మంగళవారం శ్రీ వీరపెద్దన్న స్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామస్తుల ఆధ్వర్యంలో స్వామి వారి ఉత్సవమూర్తులను వివిధ రకాల పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రధాన వీధులలో గ్రామోత్సవం చేపట్టారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు విరివిగా విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని గ్రామోత్సవాన్ని వీక్షించారు.