VIDEO: 'ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'
MNCL: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాలలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. విద్యార్హతల ప్రకారం ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని, పీస్ రేట్ కార్మికులకు జీఓ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని, 2006 వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు.