నాగలాపురంలో భారీ వర్షం
తిరుపతి: నాగలాపురం ప్రాంతంలో ఈరోజు అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఒక్క సారిగా మేఘాలు కమ్ముకుని గర్జనలు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై నీరు నిల్వ ఉండటంతో రాకపోకలు మందగించాయి. రైతులకు మాత్రం ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించగా, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ కావడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.