షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం

NLR: కోవూరు(M) పాటూరు రోడ్డు కలుజు వద్ద ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ గిరిజన మహిళ పూరిల్లు అగ్నికి ఆహుతైంది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఇంటిలో ఉన్న రూ. 2లక్షలు విలువచేసే బంగారం, నగదు, ఇంటి సామాగ్రి కాలి బూడిద అయిందని బాధితురాలు లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.