'మోదీ ప్రభుత్వం భయపడిపోయింది'
పార్లమెంటులో ఓటు చోరీ, SIR అంశాన్ని రాహుల్ గాంధీ, ఖర్గే లేవనెత్తినప్పుడు మోదీ ప్రభుత్వం భయపడిపోయిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. అందుకే వందేమాతర గేయంపై చర్చను తీసుకొచ్చిందని చెప్పారు. దేశంలో పెద్ద పెద్ద ప్రజాసమస్యలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. కానీ, మోదీ ప్రభుత్వం వాటిపై చర్చించేందుకు ధైర్యం చేయదని ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు.