దివ్యాంగులకు RTC శుభవార్త

దివ్యాంగులకు RTC శుభవార్త

AP: రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇంద్రధనుస్సు' పథకంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లుగా అధికారికంగా వెల్లడించింది. ఈనెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దివ్యాంగులకు రవాణా భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించింది.