వసతి గృహ బియ్యం అక్రమ విక్రయం
MHBD: గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో కస్తూరిబా గర్ల్స్ హాస్టల్‌కు కేటాయించిన ఐదు క్వింటాళ్ల సన్నబియ్యం అక్రమంగా విక్రయించినట్లు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు ధృవీకరించారు. విద్యార్థుల సంక్షేమం కోసం అందించిన బియ్యాన్ని పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత, ఇప్పల్ తండాకు చెందిన ఇస్లావత్ వీరన్న ఇంట్లో నిలువున్నట్లు పేర్కొన్నారు.