యరగండ్లపల్లి గ్రామ శివారులో నెమలి ఈకలు కలకలం

యరగండ్లపల్లి గ్రామ శివారులో నెమలి ఈకలు కలకలం

NLG: మర్రిగూడ మండలం యరగండ్లపల్లి శివారులో సోమవారం సాయంత్రం నెమలి ఈకలు కలకలం రేపాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శివన్నగూడెం రిజర్వాయర్ కాలువ సమీపంలో నెమలి ఈకలు పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తుందని, వేటగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా నెమళ్లను బంధించి చంపి ఈకలు పీకి మరోచోట మాంసం విక్రయించి ఉంటారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.