అనంతపురంలో సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం
ATP: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై ఏపీ విభిన్న ప్రతిభావంతుల సంస్థ ఛైర్మన్ గడుపూటి నారాయణస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ అనంతపురంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయం తమ జీవితాల్లో వెలుగు నింపిందని ఛైర్మన్ పేర్కొన్నారు.