గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
E.G: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వి.ఎల్.పురం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై నిన్న సాయంత్రం 4.40 గంటలకు ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. జీఆర్పీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతుడి జేబులో మావూరి అప్పారావు అనే పేరుతో ప్రభుత్వాసుపత్రి మందుల చీటీ లభించిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు.