వందేళ్ల చరిత్ర కలిగిన సిద్ధాంతం గొడుగులు..!
W.G: పెనుగొండ (M) సిద్ధాంతం గ్రామం చేతితో తయారు చేసే గొడుగులకు పెట్టింది పేరు. 100 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కుటీర పరిశ్రమ నేటికీ తన ఉనికిని చాటుకుంటోంది. గొడుగుల తయారీలో వాడే వెదురు కర్రలు, నాణ్యమైన వస్త్రం వీటికి ప్రత్యేకత. ఇవి ఎండకు వేడెక్కవు, వర్షానికి తడవవు. ఆధునిక కాలం గొడుగులకన్నా ఎక్కువ మన్నికనిస్తాయి. పైగా, ఆలయ ఉత్సవాలకు ఉపయోగించే భారీ గొడుగులు ఇక్కడ అరుదుగా లభిస్తాయి.