భారీ వర్షంతో నీట మునిగిన పంటలు

NDL: సంజామల మండలంలో పలు గ్రామాలలో గురువారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి పంటపొలాలు నీటి మునిగాయి. వరద నీరు కారణంగా ఉల్లి, కంది, మినుము, మిరప తదితర పంటలు నీటమునిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేరుసోముల, రామిరెడ్డిపల్లె, గ్రామాల్లో రైతులు నీటమునిగిన పంటలను చూపిస్తు ఆవేదన వ్యక్తం చేశారు.