గుడిహత్నూర్‌లో అక్రమ మద్యం పట్టివేత
ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలో FST టీం, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి సుమారు రూ.60 వేల విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్ నగర్ కాలనీలో ఓ ఇంటి మేడపై ఓటర్లకు పంపిణీ చేసేందుకు మద్యం నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. ఎన్నికల సమయంలో మద్యంనగదు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.