భక్తి శ్రద్ధలతో మహా పూజ, శాంతి కళ్యాణం
KDP: బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామి మాలా దీక్ష భక్త బృందం బుధవారం నిర్వహించిన మహా పూజ, శాంతి కళ్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహా గణపతి సహిత శ్రీ గోవిందమాంబ సమేత, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి శాంతి కళ్యాణాన్ని, వేద పండితులు కమనీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతులు వెంకటాద్రి స్వామి, వీర శివ కుమార స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.