జాతర గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

జాతర గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

కోనసీమ: కొత్తపేట మండలం వానపల్లిలో ఉన్న శ్రీపళ్లాలమ్మ జాతర మహోత్సవ గోడ పత్రికను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. ఈ నెల 11న చిన్న జాగరం, 12న పెద్ద జాగరం, 13న తీర్థం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 13 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు నెల రోజులు తీర్థం జరగనుందన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించి ఆశీస్సులు పొందాలన్నారు