విద్యార్థులకు ఉచిత ఉపకారణాల శిబిరం

MDK: ఈనెల 22న పెద్దశంకరంపేట భవిత రిసోర్స్ సెంటర్‌లో సమగ్ర శిక్ష, ALIMCO ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాల శిబిరం నిర్వహించనున్నట్లు DEO రాధా కిషన్ తెలిపారు. రేగోడ్, అల్లాదుర్గ్, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాలకు చెందిన 18 ఏళ్ల ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు తల్లిదండ్రులతో హాజరై ఆధార్, UDID, రేషన్ కార్డు జిరాక్స్‌లు, 2 పాస్‌పోర్ట్ ఫోటోలు అందజేయాలన్నారు.