కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
KMR: కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. నెమ్లి గ్రామానికి చెందిన అన్నారం గంగారం(55) కొన్ని రోజుగా కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. చికిత్స పొందుతున్నా తగ్గకపోవడంతో మనోవేదనకు గురై ఓ షెడ్డులో ఉరేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు.