దోర్నాలలో గిరిజనుల కోసం రెండవ అన్నా క్యాంటీన్

దోర్నాలలో గిరిజనుల కోసం రెండవ అన్నా క్యాంటీన్

ప్రకాశం జిల్లా దోర్నాలలో జరిగిన సభలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా వైద్యం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనుల ఇబ్బందులను తగ్గించేందుకు కొత్త అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబుకు అనుమతి కోరామని చెప్పారు. కాగా, ఇది నియోజకవర్గంలో రెండవ క్యాంటీన్‌గా త్వరలో ప్రారంభం అవ్వనుందని తెలిపారు.