'వ్యక్తిగత విమర్శలు మానుకుని కలిసి పనిచేయాలి'

'వ్యక్తిగత విమర్శలు మానుకుని కలిసి పనిచేయాలి'

KDP: ప్రొద్దుటూరులో అభివృద్ధి పనులు నిర్లక్ష్యంగా సాగుతున్నాయని కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ బాషా ఇవాళ విమర్శించారు. అధికార, విపక్ష నేతలు ప్రజా ప్రయోజనాల కంటే పరస్పరం ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వ్యక్తిగత విమర్శలు మానుకుని పట్టణ అభివృద్ధికి కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.