VIDEO: రాఖీ పండుగ.. పట్నం నుంచి పల్లెకు..!

HYD: వరుసగా సెలవులు రావడంతో HYD నగరంలోని పలు ప్రాంతాల నుంచి రాఖీ పండుగకు అక్కా చెల్లెళ్లు సోదరుల వద్దకు, సోదరులు అక్కాచెల్లెళ్ల వద్దకు బయలుదేరి వెళ్తున్నారు. దీంతో ఉప్పల్, ఎల్బీనగర్, మెహిదీపట్నం, ఆరాంఘర్ చౌరస్తాల వద్ద రద్దీ ఏర్పడింది. ప్రయాణికులు భారీ సంఖ్యలో బస్సుల కోసం వేచి చూస్తున్నారు. సెలవుల వేళ పట్టణ ప్రజలు పల్లెబాట పట్టారు.