VIDEO: రామడుగులో సీఎం దిష్టిబొమ్మ దహనం

VIDEO: రామడుగులో సీఎం దిష్టిబొమ్మ దహనం

KNR: ఆపరేషన్ సింధూర్' పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రామడుగులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ మండల అధ్యక్షుడు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.