VIDEO: మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
కోనసీమ: రాయవరం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో అనపర్తికి చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. గురువారం మృతుల ఇంటికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనపర్తికి చిట్టూరి శ్యామల, కూడుపూడి జ్యోతి,పెంకే శేషారత్నం మృతి చెందారు. బాధిత కుటుంబీకులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.