SRH vs DC: ఉప్పల్‌లో అరుదైన ఘటన

SRH vs DC: ఉప్పల్‌లో అరుదైన ఘటన

ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో SRH తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో SRH కెప్టెన్ కమిన్స్ బౌలింగ్‌తో చెలరేగాడు. పవర్‌ప్లేలో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. కమిన్స్ బౌలింగ్ చేసిన మూడు ఓవర్లలోనూ తొలి బంతికే వికెట్ తీశాడు. అలాగే, మూడు క్యాచ్‌లను కీపర్ ఇషాన్ కిషన్ పట్టుకోవడం గమనార్హం.