VIDEO: ఘనంగా శ్రీ తలుపులమ్మ తల్లి పండుగ మహోత్సవం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ రెండో వార్డు బీసీ కాలనీలో శ్రీ తలుపులమ్మ పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేకువజాము నుండి తరలి వచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ పులిహోర ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేశారు. లాలం మురళి పాల్గొన్నారు.