డ్రైనేజీకి రూ.141.34 కోట్లు మంజూరు: హరీశ్ రావు
SDPT: సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం రూ.141.34 కోట్ల రూపాయలు మంజూరైనట్లు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం తెలిపారు. సిద్దిపేట 'శుద్ధిపేట'గా ఎన్నో అవార్డులు అందుకుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల కోసం మరిన్ని నిధులు కావాలని తాము ప్రతిపాదనలు పంపామని గుర్తు చేశారు.