VIDEO: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ప్రకాశం: పుల్లలచెరువు మండలం ఇసుక త్రిపురావరం గ్రామంలో పొలంలో వరికోత కోస్తుండగా విద్యుత్ షాక్‌తో వరికోత మిషన్ డ్రైవర్ యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో ఉన్న విద్యుత్ తీగలు యంత్రానికి తగలడంతో యాదగిరి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి అని,జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు