కుక్కల దాడి.. బాలుడికి తీవ్ర గాయాలు

కుక్కల దాడి.. బాలుడికి తీవ్ర గాయాలు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని 19వ వార్డులో వీధి కుక్కలు బెంబేలెత్తించాయి. ఇవాళ ఒక్కసారిగా రెండేళ్ల బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల సంఖ్య పెరిగిపోయి వీధుల్లో నడవాలంటేనే భయం వేస్తోందని, అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోందని వాపోతున్నారు.