నిరుపేద కుటుంబానికి ఎస్సై ఆర్థిక సాయం

నిరుపేద కుటుంబానికి  ఎస్సై ఆర్థిక సాయం

నిర్మల్: లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు మిర్యాల లక్ష్మణ్-సునంద కుటుంబం పేదరికంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న లోకేశ్వరం ఎస్ఐ సక్రినాయక్ తన వంతుగా ఆర్థిక సాయం చేశారు. వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి రూ. వెయ్యి నగదు, 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐను గ్రామస్తులు, పలువురు అభినందించారు.