కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఛైర్మన్
NRML: బైంసా పట్టణ కేంద్రంలో AMC మార్కెట్ యార్డ్‌లో ఇవాళ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ ఛైర్మన్ ఆనందరావు పటేల్ ప్రారంభించారు. రైతులు తమ పంటను తేమ రహితంగా ఉంచి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారితో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రావుల రాము, కాంగ్రెస్ నాయకులు, తదితరులు ఉన్నారు.