పూల్ నేషనల్స్ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు

పూల్ నేషనల్స్ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు

పూల్ నేషనల్స్ టోర్నీలో భారత స్టార్ పంకజ్ అడ్వాణీ రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నాడు. పురుషుల 10-బాల్ ఈవెంట్ తుదిపోరులో 11-9తో పుష్పేందర్ సింగ్‌పై గెలుపొందాడు. 9-బాల్ ఈవెంట్ ఫైనల్‌నూ పంకజ్ 9-8తో పుష్పేందర్‌ను ఓడించాడు. అలాగే, మహిళల 10-బాల్ ఫైనల్‌లో 6-4తో నీనా ప్రవీణ్‌ను చిత్ర మాగిమైరాజ్ ఓడించింది. ఇప్పటికే 9-బాల్ పోటీలో చిత్ర టైటిల్ నెగ్గింది.