ఆర్మూర్ సిద్దుల గుట్టపై పల్లకి సేవా కార్యక్రమం

ఆర్మూర్ సిద్దుల గుట్టపై పల్లకి సేవా కార్యక్రమం

నిజామాబాద్: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం శివాలయంలోని సిద్దేశ్వరునికి పంచామృతాలతో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో సిద్దేశ్వరుని వేదమంత్రోచ్ఛరణలతో మంగళ వాయిద్యాలతో రామాలయం నుండి కోనేరు వరకు పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. తర్వాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.