సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు
NGKL: లింగాల మండల కేంద్రంలోని పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరైనట్లు స్థానిక సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో ఈ రోడ్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. మంజూరైన నిధులతో త్వరలోనే పనులు ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని సర్పంచ్ చెప్పారు.