ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే
RR: మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ అన్నారు. శుక్రవారం ఆల్విన్ కాలనీ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ట్రాఫిక్ సీఐ ప్రశాంత్, GHMC అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కర్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.