పడవ పందేలు, ట్రెజర్ హంట్‌కు భీమిలి రెడీ
విశాఖ: భీమిలిలో ఇవాళ సాహస క్రీడలు సందడి చేయనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు మంగమారిపేట నుంచి మోటరైజ్డ్ బోటు రేసు, 3 గంటలకు సాల్ట్ పాన్స్ నుంచి నాన్-మోటరైజ్డ్ బోటు రేసు ప్రారంభమవుతాయి. ఒక్కో విభాగంలో 15 బోట్లు పాల్గొంటాయి. అలాగే ఉదయం 10 గంటలకు కాళీ మాత ఆలయం వద్ద ట్రెజర్ హంట్ నిర్వహించనున్నారు. పర్యాటకులు, స్థానికులు వీటిని వీక్షించవచ్చు.