‘కల్లాలలోనే వరి ధాన్యం’

‘కల్లాలలోనే వరి ధాన్యం’

KMR: సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామంలో వరి ధాన్యం కుప్పలు, కల్లాలలోనే ఉండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజులుగా కాంటాలు కాకపోవడంతో పాటు లారీలు రాకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు. సకాలంలో వరి ధాన్యం తూకం వేసి లారీల్లో లోడింగ్ చేయాలని రైతులు కోరుతున్నారు. 15 రోజులుగా కల్లాల వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.