VIDEO: 378.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
MDK: తూప్రాన్ పరిధి కరీంగూడా వద్ద 378.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు స్టేట్ విజిలెన్స్ డీఎస్పి రమేష్ తెలిపారు. సీఐ అజయ్ బాబు, సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్ నర్సింలతో కలిసి దాడులు చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం నుంచి కొండల్వాడి మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. లారీ, డ్రైవర్ వాసింఖాన్‌లను అదుపులోకి తీసుకున్నారు.