నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
WGL: నగరంలోని ఏనుమాముల సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. ఆరేపల్లి సెక్షన్ పరిధిలోని రెడ్డిపాలెం, కొత్తపేట ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ మల్లికార్జున తెలిపారు. అవసరమైన పనులు పూర్తి చేసిన వెంటనే విద్యుత్ పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.