చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు పెరుగుతున్న ప్రయాణికులు

చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు పెరుగుతున్న ప్రయాణికులు

మేడ్చల్: చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభ సమయంలో అటువైపు మొగ్గు చూపేవారు తక్కువగా ఉండేది. రోజు రోజుకి రవాణా సౌకర్యాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. ఉప్పల్, హబ్సిగూడ, బోడుప్పల్, ఈసీఐఎల్, మల్లాపూర్, చర్లపల్లి, చెంగిచెర్ల ప్రాంతాలకు చెందిన అనేక మంది ఇక్కడి నుంచే రైళ్లలో ఇతర ప్రాంతాలకు ప్రయాణం సాగిస్తున్నారు.